ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సోదరి సోదరుడు వారి మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోదరుడికి సోదరి రాఖీ కట్టగా సోదరుడు తన సోదరికి ఎంతో విలువైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ హర్యానాలో మాత్రం తమ్ముడు తన అక్కకు రాఖీ పండుగ కానుకగా ఏకంగా తన కిడ్నీని బహుమతిగా ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన ఓ మహిళ గత ఐదు సంవత్సరాల కాలం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆమెకు హైబీపీ ఉన్న కారణంగా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు తెలియజేశారు. దీంతో ఆమెకు కిడ్నీ దానం చేసే దాత కోసం ఎదురు చూశారు.
తమ కుటుంబ సభ్యులే తనకు కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా తన భర్త కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో అతన్ని పరీక్షించారు. అతనిది వేరే బ్లడ్ గ్రూప్ వేరే కావడంచేత అతని కిడ్నీ సరిపోలేదు. ఈ క్రమంలోనే తన తమ్ముడి కిడ్నీ అక్కకు సరి పోవడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన అక్కకు కిడ్నీని దానం చేశాడు. సుమారు ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స చేయగా ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ క్రమంలోనే తన అక్క ప్రాణాలను కాపాడటం కోసం తమ్ముడు ఇచ్చిన బహుమతిని చూసి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. రక్షాబంధన్ అంటే నిజమైన అర్థం ఇదే కదా.. అని అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…