Yuvraj Singh : భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. ఆయన భార్య హేజల్ కీచ్ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఈ దంపతులు ఈ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు మగ శిశువు జన్మించాడని వారు తమ సోషల్ ఖాతాల ద్వారా వెల్లడించారు.
మాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం.. అని యువరాజ్ ట్వీట్ చేశాడు. ఇక ఇదే పోస్టును హెజల్ కీచ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
బ్రిటిష్-మారిషియస్ నటి, మోడల్ అయిన హేజల్ కీచ్‌ను 2016లో యువరాజ్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవలే వీరు తమ 5వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తమకు శిశువు జన్మించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ దంపతులు తెలిపారు.
ఇక క్రికెట్ ప్రపంచంలో యువరాజ్ సింగ్ యువీగా ఎంతో రాణించాడు. 2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చాలా తక్కువ కాలంలోనే స్టార్ ఆల్ రౌండర్‌గా మారాడు. భారత్ కు అనేక మ్యాచ్‌లలో విజయాలను అందించాడు.
యువీ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తాచాటి ఓ దశలో మేటి ఆలౌరౌండర్‌గా గుర్తింపు పొందాడు. కాగా భారత్ తరఫున యువీ 304 వన్డేలు, 40 టెస్ట్‌లు, 58 టీ20లు ఆడాడు. భారత్ సాధించిన రెండు ప్రపంచకప్‌లు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే 2019 జూన్ 10న అన్ని ఫార్మాట్ల నుంచి వైదులుగొతున్నట్లు యువీ ప్రకటించాడు. దాదాపుగా యువీ 19 ఏళ్లపాటు క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లోనూ పలు జట్ల తరఫున యువీ ఆడాడు. కానీ పెద్దగా రాణించలేకపోయాడు. క్యాన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న వ్యక్తిగా యువీ అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…