Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత తన కెరీర్‌లో దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేయడమే కాకుండా ఐటమ్ సాంగ్‌లలోనూ నటించగలనని నిరూపించింది. అలాగే పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేయడంలోనూ ముందుంది. ఈ క్రమంలోనే సమంత ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో పలు బ్రాండ్ల ఉత్పత్తులకు చెందిన పోస్టులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తోంది.
సమంత తాజాగా క్రిప్టో యాప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఇందులో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి భారీగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పింది. గతేడాది 2021లో క్రిప్టో కరెన్సీలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. 2022లోనూ క్రిప్టో కరెన్సీలో చాలా మంది పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
కాగా సమంత తన పోస్ట్‌లో క్రిప్టో యాప్ లో పెట్టుబడులు పెట్టాలని చెప్పింది. కాయిన్ స్విచ్ అనే కంపెనీకి చెందిన కుబేర్ అనే యాప్‌లో బిట్ కాయిన్ కొనవచ్చని తెలిపింది. బరువు తగ్గాలనుకునేవారు జిమ్‌లో సాధన చేయడం మొదలు పెట్టినప్పుడు ఎలాగైతే చిన్న చిన్నగా బరువులు ఎత్తుతారో అలాగే క్రిప్టో యాప్‌లోనూ కనీసం రూ.100తో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయవచ్చని, ఆర్థికంగా స్థిరపడాలని అనుకునేవారు మంచి మార్గంలో పెట్టుబడులు పెట్టాలని సమంత సూచించింది.
ఇక సదరు యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే రూ.200 విలువైన బిట్ కాయిన్‌ను ఉచితంగా పొందవచ్చని, బిట్ కాయిన్ గురించి ఏమీ తెలియకపోయినా ఆ యాప్ కు చెందిన యూట్యూబ్ చానల్స్, బ్లాగ్స్‌లో చూసి తెలుసుకోవచ్చని సమంత తెలియజేసింది. ఇక ఈ యాడ్‌ను సమంత జిమ్‌లో చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఆమె అందాలన్నీ ఆరబోస్తూ ఈ యాప్‌కు ప్రచారం చేయడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…