దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య అధికమవుతోంది.
ఈ క్రమంలోనే నేడు కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో చర్చించనున్నారు.