ఇన్ని రోజుల వరకు కూల్ డ్రింక్ బాటిల్ లో పాము పిల్లలు కనిపించాయి అంటూ ఎన్నో వార్తలు విన్నాం. కానీ తాజాగా ఈ పాము పిల్లలు మద్యం బాటిల్ లో దర్శనమిస్తున్నాయి. దేశంలో ఎక్కువగా అమ్ముడు పోయే వాటిలో మద్యం ఒకటి. మద్యం అమ్మటం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతోంది. ఇలాంటి రాష్ట్రాలలో తమిళనాడు రాష్ట్రం ఒకటి.
తమిళనాడులోని అరియలూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గరికి వెళ్లి మద్యం బాటిల్ లు కొనుగోలు చేశాడు. ఆ బాటిల్ తీసుకెళ్లి తాగుతూ కూర్చున్నాడు.అయితే సగం బాటిల్ తాగిన తర్వాత సురేష్ మద్యం బాటిల్ లో పాము పిల్ల ఉండటం గమనించాడు. బాటిల్ లో ఉన్నది పామని గుర్తించడంతో దెబ్బకు తాగిన మత్తు మొత్తం వదిలింది.
సురేష్ వెంటనే తేరుకొని మద్యం బాటిల్ ఏ దుకాణం దగ్గర అయితే కొనుగోలు చేశారో అక్కడకు పరుగున వెళ్లి మద్యం దుకాణాల దారులను నిలదీశాడు.అయితే వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే సురేష్ అక్కడి నుంచి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం పరుగులు పెట్టాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పెద్దాస్పత్రికి వెళ్లి సరైన చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ విధంగా మద్యం బాటిల్ లో పాము పిల్లలు కనిపించడంతో మందుబాబుల అందరూ ఎంతో షాక్ కి గురయ్యారు.