Meena : భర్త మరణంతో మీనా బాగా కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం అనంతరం కొన్ని రోజుల పాటు ఆమె బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉంది. తరువాత మళ్లీ ఈ మధ్యనే బయటకు వచ్చింది. షూటింగ్స్‌లోనూ పాల్గొంటోంది. మీనా భర్త కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. అయితే ఆయన మరణం వల్ల అనేక పుకార్లు షికారు చేశాయి. భర్తను ఆమెనే చంపేసిందని అన్నారు. కొందరైతే ఆస్తి కోసం భర్త ప్రాణాలను తీసిందని అన్నారు.
ఇక భర్త మరణం అనంతరం అనేక పుకార్లు వస్తుండడంతో స్పందించిన మీనా.. తనపై దుష్ప్రచారం చేయొద్దని.. తనకు ప్రైవసీ కల్పించాలని కోరారు. అయితే మీనా భర్త విద్యాసాగర్‌కు రూ.250 కోట్ల ఆస్తి ఉందని సమాచారం. ఆ మొత్తాన్ని కుమార్తె పేరిట వీలునామా రాశారని కూడా తెలుస్తోంది. అయినప్పటికీ మీనాకు కూడా ఆస్తి పాస్తులు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు రూ.37 కోట్ల మేర విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

2016లో ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనంలో మీనా ఆస్తి విలువ రూ.17 కోట్లు అని చెప్పారు. అయితే ఈ 6 ఏళ్లలో ఆమె అనేక సినిమాలు, సీరియల్స్‌లో నటించింది. అంతేకాదు.. మీనా మంచి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. కనుక ఆమె ఇండస్ట్రీ ద్వారా బాగానే సంపాదిస్తుందని టాక్ ఉంది. దీంతో ఇప్పుడు ఆమె ఆస్తి విలువ రూ.37 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.
ఇక మీనా తొలి సినిమా నెంజగల్ కాగా 1982లో ఈ మూవీ వచ్చింది. తెలుగులో ఈమె ఇల్లాలు ప్రియురాలు అనే మూవీ ద్వారా పరిచయం అయింది. అయితే అంతకు ముందే బాలనటిగా ఈమె ఆకట్టుకుంది. ఇక మీనాకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నైనిక. ఈమె కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది.