Ghajini Movie : కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈయన తీసిన చిత్రాలు ఒక్కోటి దేనికదే ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఇక ఈయన సూర్యతో కలసి గజిని అనే మూవీని తీశారు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఇందులో సూర్యకు జోడీగా ఆసిన్ నటించింది. ఇక హిందీలోనూ ఇదే పేరిట అమీర్‌ఖాన్ ఈ మూవీని రీమేక్ చేయగా.. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలో సూర్య నటనతోపాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటాయి.
గజిని మూవీకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఇక సూర్య కన్నా ముందుగా ఈ మూవీ కథను 12 మంది స్టార్ హీరోలకు వినిపించారట. కానీ వారందరూ రిజెక్ట్ చేశారట. దీంతో ఆ చాన్స్ ను సూర్య దక్కించుకున్నారు. ఆయన ఈ మూవీని చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే 2003లో ఈ మూవీ కథను పట్టుకుని మురుగదాస్ అనేక మంది హీరోల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలోనే ముందుగా ఈ కథను నిర్మాత సురేష్ బాబుకు వినిపించారట. దీంతో ఆయన మహేష్ అయితే బాగుంటుందని అన్నారట. కానీ ఎందుకో అది వీలు కాలేదు. తరువాత వెంకటేష్‌ను అనుకున్నారు. కానీ గుండు గెటప్‌తో నటించేందుకు వెంకటేష్ అంగీకరించలేదట. దీంతో ఆయన కూడా తప్పుకున్నారు.

ఇక వెంకటేష్ అనంతరం పవన్ కల్యాణ్, కమల హాసన్, విజయ్.. ఇలా మొత్తం 12 మంది స్టార్ హీరోలు గజిని మూవీ కథను రిజెక్ట్ చేశారు. అయితే చివరకు సూర్య కథ విని నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. అలా గజిని షూటింగ్ జరిగింది. చివరకు మూవీ రిలీజ్ అయింది. ఘన విజయం సాధించింది. ఈ మూవీ సూర్య కెరీర్‌లోనే ఒక మైలు రాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక దీన్ని అల్లు అరవింద్ బాలీవుడ్ లో అమీర్‌ఖాన్‌తో తీసి అక్కడ లాభాలను గడించారు. అలా గజిని మూవీ సౌత్, నార్త్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సూర్యకు ఎంతగానో పేరును తెచ్చి పెట్టింది.