Yashoda Movie : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో సమంత నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఈచిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి – హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుంది. అయితే ఈ చిత్ర కథ గురించి అనే లీకులు వస్తున్నాయి. కథలో భాగంగా ఒక వ్యక్తి ముఖానికి రాసుకునే మెడిసిన్ కనిపెడతారు. ఆ మెడిసిన్ రాసుకుంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులుగా కనిపిస్తారు.

ఆ మెడిసిన్ ఉపయోగించిన వ్యక్తిలో కూడా వింత మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ పరిణామాలతో కథ ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుందట. ఈ మెడిసిన్ కోసం సమంత విదేశాలకు వెళుతుందట. స్కిన్ ప్రాబ్లెమ్ తో బాధపడే సమంత ఆ మెడిసిన్ కోసం విదేశాలకు వెళ్లి చిక్కుల్లో పడుతుందని అంటున్నారు. సరిగ్గా సమంత రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఇటీవల సమంత చర్మ వ్యాధితో బాధపడుతోందని.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. దీంతో సామ్ రియల్ లైఫ్ కి యశోద మూవీకి లింక్ పెడుతున్నారు నెటిజన్స్.