Kantara Movie : కాంతారా.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అక్టోబర్ 15న విడుదల చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వా..వ్ అనిపించింది. అయితే ఈ సినిమాని థియేటర్స్‌లో చూడలేకపోతున్న ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నవంబర్ 4 శుక్రవారం నాడు కాంతారా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది.

అల్లు అరవింద్‌కి ఆహా సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉంది. మరి కాంతారా సినిమాను అమెజాన్ ప్రైమ్‌తో ఆహా కూడా పంచుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలను జీ5తో పాటు.. హాట్ స్టార్‌లోనూ స్ట్రీమింగ్ చేశారు. అలాగే కాంతారా విషయంలో ఆహా, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా రిలీజ్ చేస్తాయేమో చూడాలి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించిన ఈ మూవీ కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైంది.