Xiaomi : మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ 3 రోజుల వ్యవధిలోనే తన ఎంఐ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్ టీవీలను 1 లక్ష యూనిట్ల మేర అమ్మినట్లు తెలియజేసింది. దీవాలి విత్ ఎంఐ పేరిట ఆ సంస్థ ఓ ప్రత్యేక సేల్ ను ఇప్పటికే నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆ మొత్తంలో టీవీలు అమ్ముడైనట్లు ఆ కంపెనీ తెలియజేసింది.
ఈ సేల్‌లో భాగంగా ఎంఐ ఆన్ లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో షియోమీ తన స్మార్ట్ టీవీలను చాలా తగ్గింపు ధరలకు అందిస్తోంది. అందుకనే కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 1 లక్ష టీవీలను ఆ సంస్థ విక్రయించింది.
4కె టీవీలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారని షియోమీ తెలియజేసింది. ఈ క్రమంలోనే 50, 32. 43 ఇంచుల టీవీలను ఎక్కువగా కొంటున్నట్లు తెలిపింది. వాటిపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.