Redmi : మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ బ్రాండ్ పేరిట మరో కొత్త ఫోన్‌ను రెడ్‌మీ నోట్ 10 లైట్ పేరిట విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. దీంట్లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు.
ముందు వైపు ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. 5020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ను అందిస్తున్నారు.
ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1250 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.