Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి ఏ విషయంలో అయినా ఎంటర్ అయ్యింది అంటే అవతల ఎవరు ఉన్నా వారిని చెడామడా తిడుతూ వారికి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఎంతో మందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీ రెడ్డి తాజాగా నేచురల్ స్టార్ నానిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నాని సపోర్ట్ గా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలను పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీ గురించి చాలా కరెక్ట్ గా మాట్లాడారని నాని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ క్రమంలోనే నానిపై శ్రీ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. నాని అంటే పేర్ని నానినో.. కొడాలి నానినో.. కాదు.. హీరో నాని. ఈయన ఏమంటాడు.. పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కన పెడితే అతను మాట్లాడింది కరెక్టే అంటాడా.. అరే నత్తి నా కొడకా నోట్లో ఏం పెట్టుకున్నావ్..? సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చెయ్.. నువ్వు, పవన్ కళ్యాణ్ ఒకటే కదా.. అంటూ నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.