Heel Pain : ప్రస్తుతకాలంలో మడమల నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల నొప్పి సమస్య ఎదురవుతుంది. మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడమ నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది.
ఉదయం సమయంలో మంచంపై నుంచి కాలు కింద పెట్టగానే అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడవలసి వస్తుంది. దీని కోసం మందులు వాడడం కన్నా ఇంటి చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి. ఇందు కోసం కేవలం గోరింటాకు, ఆముదం ఉంటే చాలు. గోరింటాకు ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఈ గోరింటాకు ఆకులను ఆముదంలో వేసి బాగా వేయించాలి. ఈ నూనెను వడకట్టి మడమ నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత వేయించిన గోరింటాకును మడమ నొప్పి ఉన్న చోట ఎంత వేడి అయితే పట్టగలరో పట్టులా వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఈ విధంగా రెండు, మూడు రోజుల పాటు చేస్తే మడమ నొప్పి తగ్గుముఖం పడుతుంది.
మడమలో నొప్పి ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు పది నిమిషాలసేపు ఐస్ ముక్కతో పాదానికి కాపడం పెట్టాలి. ప్రతి రోజూ కొంత సమయం నడవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి మడమల నొప్పి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మడమల నొప్పి తగ్గడానికి మరో చిట్కా కూడా మనకు ఎంతగానో సహకరిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మడమ నొప్పి తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. బకెట్ గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మన పాదాలను 15 నిమిషాల పాటు ఉంచడం ద్వారా మడమల నొప్పి అనేది మటుమాయమవుతుంది. ఇలా రోజూ చేస్తే నొప్పి నుంచి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…