Jajikaya : వంట‌ల త‌యారీలో వాడే జాజికాయ‌ల‌తో క‌లిగే ఉప‌యోగాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Jajikaya : మనం కొన్ని ర‌కాల వంట‌ల త‌యారీలో జాజికాయ‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా శ‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. జాజికాయ ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. పూర్వ‌కాలంలో ప్ర‌తి వంటింట్లో జాజికాయ త‌ప్ప‌కుండా ఉండేది. మ‌న‌కు వ‌చ్చే కొన్ని ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను నయం చేయ‌డంలో జాజికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జాజికాయ‌ను ఉప‌యోగించి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

జాజికాయ చేదు, వ‌గ‌రు రుచుల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని నుండి నూనెను కూడా త‌యారు చేస్తారు. జాజికాయ చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. జాజికాయ వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది. వాత, క‌ఫ రోగాల‌ను న‌యం చేయ‌డంలో జాజికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. నోటి పూత‌ను, ఉబ్బు రోగాన్ని, క్రిమి రోగాన్ని త‌గ్గించ‌డంలో జాజికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జాజికాయ‌ను పాల‌తో అర‌గ‌దీసి ఆ గంధాన్ని పై పూత‌గా రాయ‌డం వ‌ల్ల నోటి పూత త‌గ్గుతుంది. మ‌లేరియా జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో కూడా జాజికాయ ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌లేరియా జ్వ‌రంతో బాధ‌ప‌డే వారు ఉద‌యం ప‌ర‌గ‌డుపున 10 గ్రా. ల ప‌టిక బెల్లాన్ని చ‌ప్ప‌రించి, ఆ త‌రువాత 2 గ్రా. జాజికాయ కొద్ది కొద్దిగా న‌ములుతూ మింగాలి. ఇలా చేసిన అర గంట వ‌ర‌కు ఏమీ తిన‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌లేరియా జ్వ‌రం త‌గ్గుతుంది.

జాజికాయ‌ను ఆవు నెయ్యితో అర‌గ‌దీసి ఆ గంధాన్ని కంటిరెప్ప‌ల‌పై రాసి ప‌డుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. జాజికాయ‌ను బియ్యం క‌లిపిన నీటితో అర‌గ‌దీసి ఆ గంధాన్ని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో అదే బియ్యం క‌డిగిన నీటితో క‌లిపి తీసుకుంటే వాంతులు త‌గ్గుతాయి. జాజికాయ పొడిని, ఆవు నెయ్యితో క‌లిపి పై పూత‌గా రాయ‌డం వ‌ల్ల పుండ్లు త‌గ్గుతాయి. జాజికాయ‌ను, అక్క‌ల‌క‌ర్ర‌ను, జాప‌త్రిని, చిన్న యాల‌కులను, ల‌వంగాలు, నాగ‌కేస‌రాలను ఒక్కొక్క‌టి ప‌ది గ్రాముల చొప్పున తీసుకుని దంచి పొడి చేసుకోవాలి. దీనిలో 3 గ్రా. ప‌చ్చ‌క‌ర్పూరాన్ని క‌లిపి ఆ మొత్తం చూర్ణాన్ని త‌మ‌ల‌పాకు ర‌సంతో క‌లిపి నూరి శ‌న‌గ గింజ‌ల ప‌రిమాణంలో మాత్ర‌లుగా చేసి నీడ‌కు ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్ర‌ల‌ను రోజుకు రెండు లేదా మూడు పూట‌లా కండచ‌క్కెర‌తో క‌లిపి తీసుకున్న త‌రువాత పాల‌ను తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతిని సంత‌రించుకుంటుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల పురుషుల‌ల్లో వీర్య వృద్ధి, వీర్య స్తంభ‌న క‌లుగుతుంది.

5 లేదా 6 చిటికెల జాజికాయ పొడిని మేక పాల‌తో అర‌గ‌దీసి ఆ గంధాన్ని అర క‌ప్పు మేక పాల‌తో క‌లిపి తీసుకుంటే గ‌ర్భస్రావం క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడిని, ప‌సుపును, నెయ్యిని స‌మ‌పాళ్ల‌లో తీసుకుని మెత్త‌గా నూరి ఆ మిశ్రమాన్ని పెద‌వుల‌పై లేప‌నంగా రాస్తూ ఉంటే పెద‌వుల ప‌గుళ్లు త‌గ్గుతాయి. జాజికాయ పొడిని, దోర‌గా వేయించిన చ‌లువ మిరియాల పొడిని స‌మ‌పాళ్ల‌లో క‌లిపి నిల్వ చేసుకోవాలి. దీంతో రోజూ దంతాల‌ను శుభ్రం చేసుకుంటే క‌దిలే దంతాలు గ‌ట్టిప‌డ‌తాయి.

జాజికాయ‌ల పొడి 10 గ్రాములు, హార‌తి క‌ర్పూరం పొడి 2 గ్రాములు, పుదీనా పువ్వు ఒక గ్రాము, వాము పువ్వు అర గ్రాము మోతాదులో తీసుకుని క‌లిపి నిల్వ చేసుకోవాలి. దీనిని పూట‌కు ఒక గ్రాము మోతాదులో మంచి నీటితో క‌లిపి మూడు పూట‌లా తీసుకుంటే త‌ల‌నొప్పి, జ‌లుబు వంటివి త‌గ్గుతాయి. జాజికాయ‌ను మంచి నీటితో క‌లిపి అర‌గ‌దీసి ఆ గంధాన్ని నుదుటిపై రాయ‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. ఈ విధంగా జాజికాయ‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని, దీనిని త‌ప్ప‌కుండా వంట‌గ‌దిలో ఉంచుకోవాల‌ని.. నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
Editor

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM