Viral Video : సాధారణంగా ఇంట్లో మనం ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారు, బంధువులు లేదా స్నేహితులు చనిపోతే విలపిస్తాం. మరీ వారు చనువుగా ఉంటే ఆ బాధ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే అలా చనిపోయిన వారిని నిత్యం స్మరించుకుంటూ ఉంటాం. అలాగే వారి పేరిట కొందరు సంస్మరణ సభ లేదా శ్రద్ధాంజలి సభలను నిర్వహిస్తుంటారు. వారు చేసిన పనులను, వారితో తమకున్న అనుబందాన్ని, జ్ఞాపకాలను ఆ సభ సందర్భంగా గుర్తు చేసుకుని విచారిస్తుంటారు. ఇది సహజంగానే ఎక్కడైనా జరిగేదే. కానీ అక్కడ మాత్రం ఈ సభను చాలా వెరైటీగా ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వృద్ధ దంపతులకు సంస్మరణ సభ నిర్వహిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. అయితే సంస్మరణ సభ అంటే ఆధ్యాత్మిక ప్రవచాలో.. భక్తి గీతాలో.. లేక ఎవరైనా ప్రసంగాలో చేస్తారు. కానీ వారు మాత్రం ఏకంగా రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఓ డ్యాన్సర్ సల్మాన్ ఖాన్ కు చెందిన వాంటెడ్ అనే సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఆమె ఆ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసింది.

అయితే అక్కడ శ్రద్ధాంజలి సభ అని పెట్టి ఉండడాన్ని స్టేజి బ్యానర్‌పై చూడవచ్చు. కానీ ఆమె అలా బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే ఎవరూ వద్దని చెప్పలేదు. పైగా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ దృశ్యాలను ఫోన్‌లో బంధించి అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాల కామెంట్లు పెడుతున్నారు. శ్రద్ధాంజలి సభ అని పెట్టి ఇలాంటి డ్యాన్స్‌లు ఏంది సామీ.. కొంచెమైనా సిగ్గు లేదా.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
View this post on Instagram