Tollywood : టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో పలువురు అగ్ర హీరోలకు చెందిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆర్ఆర్ఆర్ తప్ప ఇతర ఏ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల విడుదలైన మహేష్ బాబు సర్కారు వారి పాటకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే టాలీవుడ్ విషయానికి వస్తే నంబర్ వన్ హీరో అంటూ ఎవరూ ఉండరు. మెగాస్టార్ చిరంజీవి తన అనుభవం, పెద్దరికం దృష్ట్యా నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం చూస్తే టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం వేరే హీరోకు దక్కింది. అది ఎవరంటే..
ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. టాలీవుడ్‌లో ఏప్రిల్ మాసానికి గాను టాప్ 10 లో ఉన్న హీరోల జాబితా ఇలా ఉంది. ఈ జాబితాలో ఎన్‌టీఆర్ నంబర్ వన్ స్థానం దక్కించుకోగా.. రెండో స్థానంలో ప్రభాస్ నిలిచారు. అలాగే అల్లు అర్జున్‌కు 3వ స్థానం దక్కింది. ఇక ఈ లిస్ట్‌లో రామ్ చరణ్ 4వ స్థానంలో ఉన్నారు.

అయితే మహేష్ బాబు ఈ జాబితాలో నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ స్థానంలో నిలిచారు. కానీ ఆశ్చర్యంగా ఆయన 5వ స్థానానికి పడిపోయారు. ఇక 6వ ప్లేస్‌లో పవన్ కల్యాణ్ ఉండగా.. నాని, విజయ్ దేవరకొండలు 7, 8 స్థానాల్లో నిలిచారు. చిరంజీవి 9వ స్థానంలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానంలో ఉండడంపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.