Sumanth : యార్లగడ్డ సుమంత్ కుమార్.. నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ అంటే అందరికీ సుపరిచితమే. హీరోగా స్టార్ హోదా లేకపోయినా సినీ అభిమానులందరికీ సుపరిచితమే. సుమంత్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మాములు గా ఉండదు. తాత లెజెండ్, మేనమామ స్టార్ హీరో, తండ్రి నిర్మాత, లక్షల సంఖ్యలో ఉన్న అక్కినేని అభిమానులు. అంతే కాకుండా ఆరడుగుల అందగాడు. మంచి నటుడు. స్టార్ హీరోకు కావల్సిన అన్ని హోదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు సరసన స్టార్ హీరోగా ఉండాల్సిన సుమంత్ ఎందుకు ఆ హోదాను అందుకోలేకపోయాడు.. అంటే.. అందుకు అనేక కారణాలే ఉన్నాయని చెప్పవచ్చు.
చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉన్న సుమంత్ హీరో కాకముందే ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నాడు. 1997 నుండే నాగార్జున.. సుమంత్ ను హీరోగా పరిచయం చేయాలని చూసినప్పటికీ 1999 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ చిత్రంతో సుమంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. ఆ తరువాత యువకుడు సినిమా తీశాడు. ఆ సినిమా కూడా అంత పెద్దగా విజయాన్ని అందుకోలేదు. మూడో సినిమా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పెళ్లి సంబంధం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకు పోయిన సుమంత్ చాలా కాలం వరకు ఎటువంటి సినిమాలోనూ నటించలేదు.
ఆయన నటించిన స్నేహమంటే ఇదేరా, రామ్మా చిలకమ్మా సినిమాలు కూడా విజయాన్ని సాధించ లేదు. ఈ సినిమాలతో తనలోని నటనా శక్తిని చూపించినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేక పోయాడు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన సత్యం సినిమాతో సుమంత్ హీరోగా మళ్లీ తెరపైకి వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన గౌరి సినిమా యాక్షన్ హీరోగా గుర్తింపును తెచ్చింది. అయినప్పటికీ స్టార్ హీరో హోదా మాత్రం సుమంత్ కు రాలేదు. ఈ తరువాత వచ్చిన గోదావరి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
2011 లో వచ్చిన గోల్కోండ హై స్కూల్ సినిమా వరకు సుమంత్ కు ఎటువంటి హిట్స్ లేవు. చాలా తక్కువ సినిమాలు చేస్తూ కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నాడు సుమంత్. దగ్గరగా – దూరంగా, సుబ్రమణ్యపురం, మళ్ళీ రావా, కపటదారి వంటి సినిమాలు కమర్షియల్ గా హిట్ తీసుకురావడంతోపాటు హీరోగా పేరు తెచ్చాయి. సుమంత్ లో మంచి నటుడు, కొత్తదనం కోసం ప్రయత్నించే హీరో ఉన్నాడు. కానీ స్టార్ గా మాత్రం ఎదగ లేకపోయాడు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి.
మొదటి సినిమా ఫ్రభావం కూడా సుమంత్ పై చాలా ఉంది. స్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలను సుమంత్ అందుకోలేక పోయాడు. ఇది సుమంత్ తరువాత సినిమాలపై కూడా ప్రభావం చూపించింది. 1997 నుండి 2003 మధ్యలో వచ్చిన దాదాపు 20 సినిమాలను సుమంత్ రిజెక్ట్ చేశాడు. ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యాయని స్వయంగా సుమంత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తొలిప్రేమ సినిమాతో సుమంత్ ను పరిచయం చేయాలని చూడగా నాగార్జున ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. నువ్వే కావాలి, నువ్వు వస్తావని, మనసంతా నువ్వే, ఇడియట్ వంటి సినిమాలకు కూడా ముందు సుమంత్ ను సంప్రదించారు. ఈ సినిమాలన్నింటినీ సుమంత్ వదులుకున్నాడు. ఒకవేళ ఈ సినిమాలన్నింటినీ సుమంత్ చేసి ఉంటే స్టార్ హోదాలో ఉండే వాడు. ఆయనకు స్టార్ హోదా రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అక్కినేని ఫ్యాన్స్ అంచనాలను అందుకకోలేక పోతున్నాను అని డిఫ్రెషన్ లోకి వెళ్లిన సుమంత్ కొత్త కొత్త నిర్ణయాలను తీసుకున్నాడు. కథలో కొత్తదనం ఉంటేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర హీరోలు స్టార్స్ గా ఎదుగుతున్నపటికీ సుమంత్ మాత్రం స్టార్ హోదా కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, ఎంత సపోర్ట్ ఉన్నా కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. అన్ని రకాలుగా విధి సుమంత్ కెరీర్ తో ఆడుకుంది. దీంతో ప్రస్తుతం సుమంత్ ఒక సాధారణ హీరోలా మిగిలి పోయాడు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…