Taapsee : సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ముందు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. ఝుమ్మంది నాదం చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఈమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. కానీ అవి అంత గుర్తింపు తీసుకురాని పాత్రలే. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్‌లో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది.
బాలీవుడ్‌లో తాప్సీ గోల్డెన్ లెగ్‌గా మారింది. చేసిన ప్రతి సినిమా హిట్టే. ఈమె నటించిన ప్రతి సినిమా కొత్తగా ఉండటంతోపాటు తాప్సీ తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్న తాప్సీ ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారింది. దీని వెనుక చాలా కష్టం ఉంటుందని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఒకప్పుడు రోజుకు రెండుసార్లు భోజనం చేసేదాన్ని. ప్రస్తుతం ఐదారుసార్లు కొద్దికొద్దిగా తింటున్నా. ప్రతిసారీ ఒకే మోతాదులో తీసుకోవడం వలన చాలా మార్పులు వచ్చాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో దక్షిణాది ఇడ్లీ సాంబార్ తప్పక ఉంటుంది.
లంచ్‌లో రోటీ, దాల్, సబ్జీ, పెరుగు. ఎండాకాలం కాబట్టి కోకోనట్ షేక్ విత్ మలయ్ ఉంటుంది . స్నాక్స్‌గా నట్స్ తీసుకుంటా. రాత్రికి కిచిడి, సుషి, ఫిష్, థాయ్ కర్రీ.. ఇదీ నా మెనూ. అయితే రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లానే ఉండు.. అనే పద్ధతిని నేను తప్పక పాటిస్తాను. ఎక్కడికెళితే అక్కడి వంటకాలను టేస్ట్ చేస్తాను. లక్నో వెళితే చాట్, మటన్ ఆరగించాల్సిందే. జైపూర్ వెళితే దాల్ బాటీతో దోస్తీ చేస్తా. ప్రతి రోజూ వర్కవుట్స్ మాత్రం తప్పక చేస్తాను. సంప్రదాయ వంటకాలు మాత్రమే మన ఆరోగ్యానికి మంచిదని నేను విశ్వసిస్తున్నాను.. అని తాప్సీ అంటుంది. తాప్సీ గత కొంత కాలంగా ప్రముఖ బ్యడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌తో ప్రేమలో ఉంది. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట. అంతే కాకుండా వీరి పెళ్ళికి ముహూర్తం కూడా ఖరారయినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…