Sai Pallavi : సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వివాదాలకు కాస్త దూరంగానే ఉండేందుకు యత్నిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటారు. వారు చేసే పనులు, పెట్టే కామెంట్లు, మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో కొందరికి నచ్చవు. దీంతో వివాదాస్పదం అవుతుంటారు. సినిమాలు చేశామా.. హిట్ కొట్టామా.. వెకేషన్‌కు వెళ్లామా.. మళ్లీ సినిమా మొదలెట్టామా.. అన్నట్లుగానే చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు. ఎవరూ అంత సులభంగా వివాదాల్లో కావాలని చిక్కుకోరు. కానీ సాయిపల్లవి పంథా చూస్తుంటే మాత్రం కావాలనే మళ్లీ వివాదంలో ఇరుక్కోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది.
సాయిపల్లవి సహజంగానే ఏ వివాదం వైపుకు వెళ్లదు. కానీ ఇటీవలే ఆమె విరాట పర్వం సినిమా రిలీజ్‌కు ముందు అనవసరంగా ఓ వర్గం వారిని బాధపెట్టేలా వ్యాఖ్యలు చేసింది. అక్కడ ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసిందా.. లేక ఆ వ్యాఖ్యలు నిజంగానే వాళ్లను బాధపెట్టాయా.. ఆమె ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడిందా.. అన్నది పక్కన పెడితే.. ఏదో తెలిసో తెలియకో అలా మాట్లాడింది అనుకుంటే.. ఆ గొడవ అక్కడితో అయిపోయింది. ఆమె సారీ కూడా చెప్పేసింది.
అయితే మళ్లీ అదే గొడవ గురించి కామెంట్లు చేస్తుంటే ఏమనాలి ? మళ్లీ అయిపోయిన దాన్ని తిరిగి తోడడం ఎందుకు ? ఒకసారి కామెంట్స్ చేశాకే గొడవలో ఇరుక్కుంది. అలాంటి దాంట్లోకి మళ్లీ వెళ్లడం ఎందుకు ? తెలిసి తెలిసీ వివాదంలో మళ్లీ చిక్కుకుపోవడం ఎందుకు ? చూస్తుంటే ఇదంతా ఆమె కావాలనే చేస్తుందా.. అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చకుండా ఉంటే మంచిది. అసలే ఆఫర్లు లేక ఆమె కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉంది. ఇలాంటి సమయాల్లో వివాదాల్లో ఇరుక్కోవడం అవసరమా.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సాయిపల్లవి ఇప్పటికైనా తన పంథాను మార్చుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…