Shiva Movie : రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి వివాదాలు. అప్పుడు ఆయన తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కానీ ఒకప్పుడు ఆయన అసలు అందనంత ఎత్తులో ఉండేవారు. వివాదాలకు కూడా దూరమే. అప్పట్లో శివ సినిమా తీసి టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. అయితే శివ మూవీ వచ్చి ఇప్పటికే 25 ఏళ్లకు పైగా అవుతోంది. అయినప్పటికీ ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇందులో నాగార్జున యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. ఈ మూవీ ఆయన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌లా నిలిచింది.
అయితే శివ మూవీ ద్వారా ఇప్పటికీ కొత్త దర్శకులు ఎంతో నేర్చుకుంటుంటారు. కెమెరాలను ఈ యాంగిల్స్ పెట్టి కూడా సినిమా తీయవచ్చా.. అని అందరినీ షాక్ చేసింది.. శివ మూవీనే. దీని ద్వారా దర్శకులు కూడా భిన్న రకాలుగా సినిమాలను ప్రజెంట్ చేయడం ప్రారంభించారు. అలా శివ అనే మూవీ అందరికీ ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. అయితే శివ మూవీని ఇన్నాళ్లూ వర్మ తన సొంత తెలివితో తీశామని అనుకుంటూ వచ్చాం. కానీ అది ఆయన సొంత కథ కాదట. అది కాపీయేనట.
అప్పట్లో బ్రూస్ లీ చిత్రాలకు ఎంతో ఆదరణ ఉండేది. ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఇందులో ఆయన తన వాళ్ల కోసం, వారి రెస్టారెంట్ కోసం పోరాడుతారు. అయితే వర్మ తాను శివ కథను దీని నుంచే కాపీ కొట్టానని తెలిపారు. అందులో రెస్టారెంట్ స్థానంలో కాలేజీని పెట్టానని అన్నారు. తరువాత కథను 20 నిమిషాల్లోనే సిద్ధం చేశానని తెలిపారు. దీంతో శివ కథ సిద్ధమైందని, దీనికి తనకు పెద్దగా కష్టం కాలేదని వివరించారు.
అయితే వర్మ ఈ విషయం చెప్పే సరికి అందరూ షాకవుతున్నారు. ఇన్ని రోజులు శివ కథ ఒరిజినల్ అనుకున్నామని కాపీ అని తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా వర్మ తీసిన లడ్కీ (అమ్మాయి) అనే మూవీ జూలై 15వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన శివ గురించి ఆ విషయాలను తెలియజేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…