Dil Raju Wife Tejaswini : తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈయన నిర్మించే చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. చిన్న నిర్మాత స్థాయి నుండి భారీ బడ్టెట్ సినిమాలను నిర్మించే స్థాయికి దిల్ రాజు ఎదిగారని చెప్పవచ్చు. సినిమాను విడుదల చేయడానికి ముందే దాని విజయాన్ని, అపజయాన్ని అంచనా వేసే వ్యక్తి దిల్ రాజు. ఇక తాజాగా ఈయన రెండో సారి తండ్రి అయ్యారు. తనకు కొడుకు పుట్టాడు. దీంతో ఆయన పడుతున్న సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం.
అయితే తన మొదటి భార్య అనిత చనిపోయిన తరువాత దిల్ రాజు మరో పెళ్లి చేసుకున్నారు. కానీ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవడానికి మొదట అంగీకరించ లేదట. తండ్రి మానసిక క్షోభకు గురి కావడాన్ని చూడలేని దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి తండ్రి రెండో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేలా చేసింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2020 మే 10న దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ పెళ్లికి చిత్ర పరిశ్రమ నుండి కానీ, స్నేహితులను కానీ ఎవరినీ ఆహ్వానించలేదు. కేవలం ఇరుకుంటుబాల సన్నిహితుల మధ్యనే ఈ వివాహం జరిగింది.
అయితే దిల్ రాజు రెండో భార్య తేజస్విని గురించి ఎవరికీ ఏ విషయాలు ఇప్పటి వరకు తెలియదు. తాజాగా ఆమె ఒక బ్రాహ్మణ కుంటుంబానికి చెందిన అమ్మాయని టాక్ నడుస్తోంది. అయితే ఆమె ఒక ప్రముఖ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిందట. ఆమెను తొలిసారి ఫ్లైట్‌లో చూసి దిల్ రాజు ఇష్టపడ్డారట. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగితే అందుకు ఆమె ఓకే చెప్పిందట. ఇక ఆమెది కూడా నిజామాబాద్ జిల్లానే అని తెలిసింది.
తేజస్వినిది నిజామాబాద్ కాగా.. దిల్ రాజుది కూడా అదే జిల్లా కావడం విశేషం. ఆమె పెళ్లి అయ్యే వరకు ఎయిర్ హోస్టెస్‌గానే పనిచేసింది. వయస్సు 34 ఏళ్లు. ఆమె అసలు పేరు తేజస్విని కాగా.. ఆమె కులం, మతం, ఇతర వివరాలు తెలియకుండా ఉండేందుకు గాను ఆమె పేరును వైగా రెడ్డిగా మార్చారు. అయితే ఇంతకు మించి తేజస్విని గురించి వివరాలు ఏవీ తెలియవు. ఏం తెలిసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారన్న ఉద్దేశంతోనే దిల్ రాజు ఆమె పట్ల ఇన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె గురించి ఎవరికీ ఏమీ తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే దిల్ రాజు నిర్మించిన ఎఫ్3 మూవీ ఈ మధ్యే విడుదలై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు పలు ఇతర సినిమాలను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…