Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న చిత్రాలు ఎక్కువగా సమాజానికి మెసేజ్‌ను అందించేవే అయి ఉంటున్నాయి. కానీ ఆయన గతంలో భిన్న ప్రయోగాలు చేసేవారు. అయితే మహేష్ బాబు తన కెరీర్‌లో 7 బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు. కొన్ని తనకు సెట్ కావని వదిలేయగా.. కొన్ని మాత్రం డేట్స్ కుదరక వదిలేయాల్సి వచ్చింది. అయితే వాటిని గనక చేసి ఉంటే మహేష్ రేంజ్ ఇంకా పెరిగి ఉండేదని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు తన కెరీర్ లో మిస్ చేసుకున్న ఆ 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనసంతా నువ్వే చిత్రంలో మొదటగా మహేష్ కే ఆఫర్ వచ్చిందట. సినిమా నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ సినిమా చేయాలని కోరాడట. అయితే అప్పటికే మహేష్ బాబు రాజకుమారుడు, యువరాజు, మురారి.. సినిమాలు హిట్ అయి స్టార్ గా ఎదుగుతున్నాడు. దాంతో ఈ సినిమాని మహేష్ వదులుకున్నాడట. అయితే చిత్రం సినిమా విడుదల కావడం.. సినిమా సక్సెస్ అవడంతో ఉదయ్ కిరణ్ తెరపైకి వచ్చాడు. దీంతో ఈ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏమాయ చేశావె సినిమా కోసం మహేశ్ బాబుని అనుకున్నాడట. అయితే కారణం తెలియదు కానీ మహేష్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ నాగ చైతన్య చేతికి వెళ్ళింది. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లొనే పెద్ద హిట్ అయ్యింది. అలాగే గోన గన్నా రెడ్డిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ రుద్రమదేవి సినిమాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. నిజానికి ఈ పాత్నుర మహేష్ బాబు చేయాల్సింది. కానీ ఎందుకో అల్లు అర్జున్ కి వెళ్ళిపోయింది. అలాగే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 24. సూర్య గెటప్స్ ఈ సినిమాలో ది బెస్ట్. సూర్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. అయితే ఈ కథను ఫస్ట్ మహేష్ బాబుకే వినిపించాడట విక్రమ్. కానీ మహేష్ మాత్రం బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు సినిమాలకు కమిట్ అయ్యాడు. దీంతో డేట్స్ సర్దుబాటు కాలేదట. ఫలితంగా మరో హిట్ మూవీ మహేష్ ఖాతాలో రాలేదు.
ఇక తమిళ స్టార్ హీరో విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ వచ్చిన కత్తి సినిమా ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుని మహేష్ బాబుని సంప్రదించారట. మహేష్ అందుకు ఒప్పుకోలేదట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150గా మన ముందుకు వచ్చింది కత్తి సినిమానే. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫిల్మ్ అ ఆ. ప్లాఫ్ లతో నితిన్ సతమతమవుతున్న టైంలో ఈ మూవీ అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ మహేష్ బాబుకే అవకాశం వచ్చినా.. రిజక్ట్ చేయడంతో నితిన్ కు ఆ అవకాశం దక్కింది. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఫిదా సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. తెలంగాణ యాస ఈ సినిమాకి కొంత ప్లస్. ఇంకా సినిమా కథ కూడా బాగుండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాని బంపర్ హిట్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమాలతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు. కానీ శేఖర్ కూడా ఈ సినిమాకి ఫస్ట్ మహేష్ నే అనుకున్నాడట. కానీ ప్రిన్స్ మాత్రం ఈ స్టోరీ తనకు సెట్ కాదని చెప్పేశాడంట. దీంతో వరుణ్ తేజ్ ఖాతాలో సూపర్ హిట్ పడింది. ఈ సినిమాతో సాయి పల్లవి రేంజ్ కూడా అమాంతం పెరిగింది.
ఇలా మహేష్ బాబు తన కెరీర్‌లో ఎన్నో సినిమాలను వదులుకున్నారు. అవి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కొన్నింటిని తనకు సెట్ కావని ఆయన వదిలేయగా.. కొన్నింటికి డేట్స్ కుదరక వదిలేశారు. అవే గనక మహేష్ ఖాతాలో పడి ఉంటే మహేష్ రేంజ్ ఇంకాస్త పెరిగి ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…