Junior NTR Remuneration : యంగ్ టైగర్ గా పేరుగాంచిన జూనియర్ ఎన్‌టీఆర్ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ మధ్యే విడుదల కాగా.. అందులో ఆయన భీమ్‌గా అదరగొట్టేశారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్‌టీఆర్ అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే 21 ఏళ్ల వయస్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాతో అనేక రికార్డులు బ్రేక్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
కాగా 2001 లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాలో రవీనా రాజ్ పూత్ హీరోయిన్ కాగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ మూవీ కంటే ముందుగానే తారక్ 1997లో బాల రామాయణం సినిమాలో నటించారు. ఈ మూవీని ఎమ్మెస్ రెడ్డి నిర్మించగా గుణశేఖర్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకున్నారు. దీనికి గాను ఎన్టీఆర్ కు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు కూడా లభించింది.
అయితే నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నిన్ను చూడాలని మూవీ యావరేజ్ గా నిలవగా దీని తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా హిట్ అయింది. ఈ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో గజాల హీరోయిన్ గా తెరకెక్కించారు. అయితే ఈ మూవీ తర్వాత ఇక ఎన్టీఆర్ వెనక్కి చూసుకోలేదు. స్టార్ నటుడు అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ మూవీ అనంతరం సుబ్బు తీయగా.. దీంట్లో సోనాలి జ్యోతి హీరోయిన్ గా చేసింది. సురేష్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ నిరాశపరిచింది.
ఇక నిన్ను చూడాలని సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఎన్టీఆర్ వయస్సు17 సంవత్సరాలే. 2001 మే 25న ఈ మూవీ థియేటర్ లలోకి వచ్చింది. ఇది తన మొదటి సినిమా. ఈ క్రమంలోనే ఈ మూవీకి ఎన్టీఆర్‌కు రూ.4 లక్షల పారితోషికం ఇచ్చారు. దీంతో ఈ సినిమాకి ఇచ్చిన మొత్తాన్ని ఎన్టీఆర్ కు ఏం చేయాలో తెలియలేదు. దీంతో ఆయన ఆ మొత్తాన్ని నేరుగా తీసుకెళ్లి తమ అమ్మ చేతిలో పెట్టారు. ఇక రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో రెమ్యూనరేషన్ తోపాటు ఆయనకు క్రేజ్ కూడా పెరిగింది. అలా ఎన్టీఆర్ ఒక్కో స్టెప్ ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్‌టీఆర్ ప్రస్తుతం రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…