Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య, సమంత ఇద్దరూ విడిపోయి ఇప్పటికి 9 నెలలు అవుతోంది. అయితే ఈ ఇద్దరూ విడిపోయిన తరువాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. కానీ సమంత మాత్రం అప్పట్లో మామ్ సెయిడ్ పేరిట అనేక సందేశాలను పోస్ట్ చేసింది. అవన్నీ ఇన్‌డైరెక్ట్‌గా చైతూనే టార్గెట్ చేస్తూ ఆమె పెట్టినవే అని అన్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా సమయం, సందర్భం దొరికినప్పుడల్లా సమంతను ఆడుకుంటూనే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా చైతూ మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు తప్ప.. సమంతపై ఏనాడూ కామెంట్స్ చేయలేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. సమంతను చైతూ టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది.
చైతన్య, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన థాంక్ యూ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. కాగా రాశిఖన్నా, చైతూ ఇద్దరూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్‌లోని ఓ డైలాగ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
థాంక్ యూ ట్రైటర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. దాన్ని చైతూ చెప్పాడు. ఒక మనిషిని పట్టుకుని వేళ్లాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలెయ్యగలిగే ప్రేమ ఎంతో గొప్పది.. అనే డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని చైతూ సమంతను ఉద్దేశించే చెప్పాడని అంటున్నారు. సినిమాలో కావాలనే ఆ డైలాగ్ పెట్టారని, అలాంటి డైలాగ్స్ మూవీలో ఇంకా ఉన్నాయని అంటున్నారు. అయితే ఒకవేళ చైతూ గనక సమంతను టార్గెట్ చేస్తే అప్పటి నుంచే ఆమెపై ఏదో ఒకటి ఇన్‌డైరెక్ట్‌గా పోసి చేసి ఉండేవాడు. కానీ అలా చేయలేదు. మరలాంటప్పుడు ఇప్పుడు సడెన్‌గా ఎందుకు ఇలా టార్గెట్ చేసి డైలాగ్స్ చెబుతున్నాడు.. అంటే.. ఈ మధ్య చైతూకు, శోభితకు ఒక లవ్ ట్రాక్ ఉందని వార్తలు వచ్చాయి కదా.. వాటిని సమంతనే ప్రచారం చేయించిందని అన్నారు. కనుకనే ఆమెను టార్గెట్ చేస్తూ చైతూ అలా డైలాగ్స్ చెప్పాడని అంటున్నారు.
వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ముగిసింది. కానీ చైతూ, శోభితల మధ్య లవ్ ట్రాక్ వార్తలను మొన్నీ మధ్యనే ప్రచారం చేశారు. కాబట్టి పైన చెప్పిన వాదన అసంబద్ధమని అనిపిస్తుంది. కానీ సమంత తనను టార్గెంట్ చేస్తుందని అప్పటి నుంచే మనసులో పెట్టుకున్న చైతూ మూవీలో అలా డైలాగ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కనుక ఎలాగూ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలి కాబట్టి చేశారు. అందులోని డైలాగ్స్‌నే ట్రైలర్‌లోనూ పెట్టారు. కానీ ఇది ఉన్నట్లుండి సమంతను టార్గెట్ చేసినట్లు కాదు. ముందు నుంచి అనుకుంటున్నారేమో ఇప్పుడు వర్కవుట్ చేశారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…