Chalaki Chanti : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 6వ సీజన్ గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్టింగ్ తో మొదటిరోజు కంటెస్టెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా మేమే గెలుస్తాము అని ధీమాగా చెబుతున్నారు. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు చలాకీ చంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొదట సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ చంటి ఆ తరువాత జబర్దస్త్ లోకి వచ్చి చలాకీ చంటిగా మారిపోయాడు.
అందులో కొన్నాళ్ల పాటు మంచి గుర్తింపును అందుకున్న చంటి అనంతరం కొన్ని విబేధాలు రావడంతో షో నుంచి బయటకు వచ్చేశాడు. ఎక్కువగా రెమ్యునరేషన్ విషయంలో విబేధాలు వచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. తనను వెళ్లగొట్టడానికి జబర్దస్త్ లో జరిగిన కుట్రలను వెల్లడించాడు. నాగార్జున నోట తన చంటి అనే పేరు వినాలని ఆశించానన్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 6కు వచ్చేముందు మల్లెమాలతో జరిగిన విషయాలను రివీల్ చేశాడు. తన రెమ్యునరేషన్ పెంచమని కోరగా, మల్లెమాల వాళ్లు.. నీ టాలెంట్ కు ఇదే ఎక్కువ అనడం తనను బాధించిందన్నారు.
మరోవైపు తాను ముక్కుసూటి మనిషినని, తప్పు జరిగితే వెంటనే ప్రశ్నిస్తానని అన్నారు. అందుకే తనను కోపిష్టి, పొగరు, అటిట్యూడ్, ఈగో అంటూ తనను ముద్రవేశారని తెలిపారు. చంటి బిగ్ బాస్ హౌజ్‌లో రచ్చ చేయడంతో పాటు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడని అందరు భావిస్తున్నారు. బింబిసార స్టైల్ లోనే ఎంట్రీ ఇస్తూ చంటిసారగా అడుగు పెట్టాడు. తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరు కూడా నాకే ఓటు వేయాలని.. తను సోలోగా ఫైట్ చేయబోతున్నట్లు చెప్పాడు. మరి బిగ్ బాస్ లో చలాకీ చంటి ఎన్ని రోజులు నిలదొక్కుకుంటాడో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…