Siddharth : హీరో సిద్ధార్థ్ 2003లో వచ్చిన బాయ్స్ అనే తమిళ్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే.. ఐఫా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఈ మధ్య అతడి సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది సక్సెస్ అవలేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ అదితి రావు హైదరితో సిద్దార్థ్ లవ్‌లో పడ్డాడంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ముంబైలోని ఓ సెలూన్ నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కెమెరాల కంట పడింది. ఇంకేముందీ.. ఫొటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫొటోలు తీస్తూ కెమెరాలు క్లిక్‌మనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దార్థ్.. తనను ఫొటోలు తీయొద్దని హెచ్చరించాడట. ఇదిలా ఉండగా రీసెంట్ గా చెన్నైలో జరిగిన పొన్నియన్ సెల్వవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఈ జంట కలిసి అటెండ్ అయ్యారు. అంతేకాదు అక్కడ వీళ్ళ ప్రవర్తించిన తీరు నడుచుకున్న విధానం కచ్చితంగా చూసిన వాళ్ళకి కాబోయే భార్య భర్తల్లాగే అనిపిస్తుంది.
అంతగా అట్రాక్ట్ చేసింది ఈ జంట. హాట్ లుక్స్ తో కనిపించారు. దీంతో అభిమానులు డౌట్ లేదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. మరి చూడాలి సిద్ధార్థ్, హైదరి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. లేదా అనేది.. అయితే సిద్ధార్థ్ కి గతంలో పెళ్లి జరిగిందనే విషయం చాలామందికి తెలీదు. 2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. వీరికి మొగ్లీ అనే కుమారుడు ఉండగా, ఆ బాలుడి బాధ్యతను సిద్ధార్థ్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…