Whatsapp : నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రతి నెలా అలాంటి ఎన్నో లక్షల మంది యూజర్లను వాట్సాప్ నిషేధిస్తోంది. ఇక వాట్సాప్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కేవలం డిసెంబర్ నెలలోనే 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడైంది.
డిసెంబర్ నెలలో మొత్తం 528 ఫిర్యాదులు అందాయని.. ఆ మేరకు మొత్తం 20 లక్షల ఖాతాలను నిషేధించామని వాట్సాప్ తెలియజేసింది. ఇక నవంబర్ నెలలో 17.5 లక్షల ఖాతాలను నిషేధించింది. సదరు యూజర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. యూజర్లకు బల్క్ మెసేజ్‌లను పంపిస్తున్నారని.. అందుకనే ఆ ఖాతాలను నిషేధించడం జరిగిందని వాట్సాప్ తెలియజేసింది.
ఇక డిసెంబర్ నెలలో మొత్తం 528 ఫిర్యాదులు అందగా.. వాటిలో 303 మంది నిషేధాన్ని ఎత్తివేయాలని కోరినట్లు తెలిపింది. గతేడాది మే నెల నుంచి వాట్సాప్ ఈ విధంగా చర్యలు తీసుకుంటోంది. దేశంలో చెలామణీలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ ఇలాంటి ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నెల నెలా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయా సంస్థలు ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలి. వారు కేంద్రానికి సమాచారం అందించాల్సి ఉంటుంది.
వాట్సాప్‌లో ప్రైవసీకి పెద్ద పీట వేశామని ఆ సంస్థ మరోమారు స్పష్టం చేసింది. యూజర్లకు పెద్ద ఎత్తున కొందరు బల్క్ మెసేజ్‌లను పంపిస్తున్నారని.. అది నిబంధనలకు విరుద్ధమని.. అందుకనే చర్యలు తీసుకున్నామని.. వాట్సాప్ తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…