Rashmika Mandanna : వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారింది. ఈమె నటిస్తున్న సినిమాలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో రష్మికను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించిన పుష్ప మూవీలో రష్మిక మందన్న శ్రీవల్లిగా నటనను ఇరగదీసిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆమె కెరీర్ జోరు మీదుంది.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. మిషన్ మజ్ను, గుడ్ బై అనే చిత్రాల ద్వారా ఆమె బాలీవుడ్ తెరకు పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే దాదాపు అన్ని భాషల్లోనూ నటిస్తున్న రష్మికకు అనేక నగరాలకు తిరగడం కష్టంగా మారిందట. దీంతో ఆమె పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రష్మిక మందన్న ఇటీవలే ముంబైలో ఓ పోష్ ఏరియాలో ఇంటిని కొనుగోలు చేయగా.. తాజాగా హైదరాబాద్‌లోనూ మరో ఇంటిని కొన్నదట. ఇందుకు గాను ఆమె భారీగానే ఖర్చు చేసిందని సమాచారం. హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ ఏరియాలో ఆమె ఇంటిని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఆమె పలు భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తుండడంతో.. ఎక్కువగా ఆయా నగరాలకు తిరగాల్సి వస్తోంది. దీంతో ఆమెకు స్టే చేసేందుకు హోటల్స్ పడడం లేదట. అందుకనే ఆయా సిటీల్లో ఇళ్లను కొనుగోలు చేసిందని సమాచారం.
ప్రస్తుతం రష్మిక మందన్న బాలీవుడ్ చిత్రాలతోపాటు పుష్ప రెండో భాగంలో నటిస్తోంది. ఏది ఏమైనా 2021, 2022 సంవత్సరాలు రష్మికకు బాగా కలసి వచ్చాయనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…