Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా మహేష్ చేయబోయే తదుపరి చిత్రాన్ని గురువారం లాంచ్ చేశారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో మహేష్ తదుపరి చిత్రం గురువారం లాంచ్ అయింది. మహేష్ బాబు 28వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అతడు, ఖలేజా తరువాత త్రివిక్రమ్ మళ్లీ మహేష్‌తో చేస్తున్న సినిమా ఇది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించాయి. దీంతో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌పై మళ్లీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖలేజా నిరాశ పరిచినా.. ఈ సారి త్రివిక్రమ్ మహేష్‌ను కొత్తగా చూపించనున్నారని సమాచారం. దీంతో మహేష్ బాబు 28వ చిత్రం హిట్ పక్కా అని అంటున్నారు.
ఇక గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి మహేష్ హాజరు కాలేదు. ఆయన తన సినిమాల లాంచింగ్‌కు హాజరు కారు. ఇది ఆయనకు ఒక సెంటిమెంట్. అయితే ఈ మూవీ లాంచింగ్‌కు మహేష్ భార్య నమత్ర హాజరయ్యారు. తొలి సీన్‌కు ఆమె క్లాప్ కొట్టారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది. మహేష్, పూజా కలిసి నటించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వీరి కాంబినేషన్ మరోమారు హిట్ అవుతుందని అంటున్నారు.
ఇక ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…