Vishwak Sen : విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం.. అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూలనే రాబట్టింది. కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. అయితే విశ్వక్‌సేన్ పుణ్యమా అని ఈ మూవీకి బాగానే పబ్లిసిటీ లభించింది. యాంకర్ దేవి నాగవల్లితో గొడవ కారణంగా ఈ మూవీకి కావల్సినంత ప్రచారం అయితే వచ్చింది. కానీ దాన్ని ఈ మూవీ నిలబెట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి కూర్చుని సరదాగా ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చన్న ఫీలింగ్‌ను అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
అశోకవనంలో అర్జున కల్యాణం మూవీకి గాను డిజిటల్ హక్కులను ఇప్పటికే ఆహా ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక సినిమా మే 6న రిలీజ్ అయింది కనుక.. 3 వారాలకు.. అంటే.. మే 27వ తేదీన ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక ఈ నెలలో ఓటీటీల్లో భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మే 20న పెద్ద మూవీలను రిలీజ్ చేయనున్నారు. జీ5లో ఆర్ఆర్ఆర్ వస్తుండగా.. అమెజాన్ లో ఆచార్యను రిలీజ్ చేయనున్నారు. అలాగే మోహన్ లాల్ ట్వెల్త్ మ్యాన్ సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే ఈ నెల 20న రిలీజ్ కానుంది.