Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌తో హాస్పిటల్‌లో చేరి అక్కడ చికిత్స తీసుకుని కోలుకున్న తరువాత చాలా రోజుల పాటు బయటి ప్రపంచానికి కనిపించలేదు. ఆ తరువాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయట కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో పవన్ కల్యాణ్ సినిమాలో తేజ్ ఒక గెస్ట్ రోల్ చేయనున్నాడు. ఆ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఇక సాయి ధరమ్ తేజ్ గతంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో మళ్లీ అందులో యాక్టివ్ అయ్యాడు. ఇక ఇటీవలే ఆయన సర్కారు వారి పాట సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
సర్కారు వారి పాట మూవీ రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్‌కు సాయి ధరమ్ తేజ్ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు మరోమారు ఇంకో హీరో మూవీకి కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి లేటెస్ట్‌గా చేసిన 777 చార్లి అనే మూవీపై తేజ్ స్పందించారు. ఈ క్రమంలోనే ఈ మూవీపై తేజ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

ఈ మూవీ ట్రైలర్‌ను చూసిన తేజ్ స్పందిస్తూ.. నా హృదయం బరువెక్కింది.. ఆ ట్రైలర్ నన్ను కదిలించింది.. నా మనస్సు చలించింది.. సోదరా రక్షిత్ శెట్టి.. నీ మీద నాకు గౌరవం పెరిగింది.. ఈ సినిమాను మనకు అందిస్తున్న రానాకు థ్యాంక్స్.. అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తరువాత సాయి ధరమ్ తేజ్ ఇలా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక 777 చార్లి అనే మూవీ విషయానికి వస్తే.. ఇందులో హీరోకు, కుక్కకు మధ్య జరిగే కథను చాలా ఎమోషనల్‌గా చూపించారు. దీంతో ఇది అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.