Virata Parvam : దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం.. విరాట పర్వం. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు ఎప్పుడో పూర్తయినా సినిమా విడుదల చాలా ఆలస్యం అయింది. అనేక కారణాల వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీని జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌ను ప్రస్తుతం వేగవంతం చేశారు. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇందులో సాయి పల్లవి ఎమోషనల్ అయింది. తనను ఆ విధంగా చూడొద్దని కోరింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మూవీకి ఊడుగుల వేణు దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మించారు. తమ సొంత బ్యానర్‌పైనే ఈ మూవీని నిర్మించినప్పటికీ ఈ మూవీ రిలీజ్ ఇంత ఆలస్యం ఎందుకు అయిందో రానా చెప్పలేదు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక నాలుగు వారాల్లో.. అంటే జూలై 17 తరువాత ఓటీటీలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
కాగా ఈ మూవీలో నందితా దాస్, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేతా పేతురాజ్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.. డానీ శాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. ఇందులో రానా, సాయి పల్లవిలు రవన్న, వెన్నెలగా నక్సల్స్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…