OTT : వారం వారం థియేటర్లలో ప్రేక్షకులను కొత్త కొత్త సినిమాలు అలరిస్తున్నాయి. అయితే మేమేం తక్కువ తినలేదు.. అంటూ ఓటీటీ యాప్‌లు కూడా సినిమాలతో సందడి చేస్తున్నాయి. వీటితోపాటు సిరీస్‌లను కూడా ఓటీటీ యాప్‌లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో వారం వారం కొత్త సినిమాలు, సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కూడా పలు ఓటీటీ యాప్‌లలో నూతన సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారంలో అమెజాన్ ప్రైమ్‌లో జయమ్మ పంచాయితీ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ నిరాశ పరిచింది. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు. యాంకర్ సుమ చాలా ఏళ్ల తరువాత పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో చేసిన మూవీ ఇది. అయినప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. లైట్ తీసుకున్నారు. ఇక ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఈ నెల 14వ తేదీన అవతార పురుష: పార్ట్ 1 అనే కన్నడ సినిమా రిలీజ్ కానుంది. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో శరన్, అషికా రంగనాథ్‌లు లీడ్ రోల్స్‌లో నటించారు. అలాగే జీ5 యాప్‌లో జూన్ 17వ తేదీన రెక్కీ అనే సిరీస్ రిలీజ్ కానుంది. ఇందులో శివ బాలాజీ, ఎస్థర్, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో జూన్ 17వ తేదీన ఓ2 అనే మూవీ రిలీజ్ కానుంది. తమిళంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. విగ్నేష్ శివన్‌తో వివాహం అయ్యాక రిలీజ్ అవుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇలా పలు మూవీలు, సిరీస్‌లు ఈ వారంలో ప్రేక్షకులను అలరించనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…