RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇందులో ఎన్‌టీఆర్ భీమ్‌గా కనిపించగా.. రామ్ చరణ్ అల్లూరిగా నటించి అలరించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి తరువాత రాజమౌళి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీలోనూ సంచలనాలను సృష్టిస్తోంది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన 50 రోజులకు ఓటీటీలో రిలీజ్ చేశారు. అప్పటికే ఈ మూవీ రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఇక ఇప్పటికీ ఈ మూవీ పలు చోట్ల ప్రదర్శితం అవుతూనే ఉంది. అయితే ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. జీ5, నెట్ ఫ్లిక్స్‌లలో ఈ మూవీ వివిధ భాషల్లో రిలీజ్ అయింది. అయితే రెండింటిలోనూ భారీ స్థాయిలో ఈ మూవీకి వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా ఓటీటీ సంస్థలు ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన పలు గణాంకాలను విడుదల చేశాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జీ5 యాప్‌లో తెలుగుతోపాటు మరో 4 భారతీయ భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే రెండు సంస్థలు కూడా పోటీ పడి మరీ ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రమోషన్స్ చేశారు. అయితే నెట్ ఫ్లిక్స్‌కు గ్లోబల్ రీచ్ ఎక్కువ కనుక అందులో వ్యూస్ బాగా వచ్చాయి. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయిన 3 వారాల్లో మొత్తం 39,480,000 గంటల వ్యూస్ వచ్చాయి. ఇక జీ5లో అన్ని భాషల్లోనూ కలిపి 16,666,667 గంటల వ్యూస్ వచ్చాయి. అంటే నెట్ ఫ్లిక్స్‌లోనే ఈ మూవీ ఎక్కువ వ్యూస్‌ను సాధించినట్లు స్పష్టమవుతోంది. ఇక పలువురు విదేశీ సెలబ్రిటీలు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ చాలా బాగుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డుల వేట దిశగా కొనసాగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…