Virata Parvam First Review : దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. విరాట పర్వం. ఈ సినిమాను గతేడాది ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఆ తరువాత కూడీ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమాకుగాను ప్రస్తుతం ప్రమోషన్స్‌ను వేగంగా నిర్వహిస్తున్నారు. రానా, సాయిపల్లవిలు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలను కూడా ఇస్తున్నారు.
అయితే ఈ మూవీకి గాను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ మూవీని చూసి చాలా బాగుందని ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే సినిమాలో ఎమోషనల్ సీన్లు బాగా ఉంటాయని తెలుస్తోంది. 1990లలో తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అప్పట్లో తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఈ మూవీలోనూ రానా, సాయిపల్లవి కూడా నక్సలైట్లుగా కనిపించనున్నారు. రానా రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా అలరించనున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత సురేష్ బాబు ఈ మూవీని నిర్మించారు.

నక్సలైట్లు అయినప్పటికీ ప్రధాన పాత్రల మధ్య అద్భుతమైన ఎమోషనల్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్, హీరో ఇద్దరూ చనిపోతారని తెలుస్తోంది. సినిమాకు ఇదే హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాను చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారట. అలా అద్బుతమైన ఎమోషన్స్‌తో ఈ మూవీని తెరకెక్కించారట. ఈ క్రమంలోనే సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ టాక్ అయితే నడుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.