Pawan Kalyan : ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏ హీరో సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయినా సరే పిలిస్తే వెళ్తున్నారు. ఆయనకు చిన్నా పెద్దా అనే భేషజాలు ఉండవు. కనుకనే ఎవరు ఆహ్వానించినా వెళ్లి వస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన హాజరైన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకు చెందిన సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఆయనపై ఐరన్ లెగ్ అన్న ముద్ర వేస్తున్నారు. పవన్ ఆ వేడుకలకు హాజరు కావడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటున్నారు. అయితే దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ హాజరైన సాయి ధరమ్ తేజ్ మూవీ రిపబ్లిక్ ఫ్లాప్ అయింది. అలాగే సైరాతోపాటు రవితేజ నేల టిక్కెట్టు కూడా అపజయాన్ని నమోదు చేసింది. దీంతోపాటు ఈమధ్యే ఆయన హాజరైన అంటే సుందరానికీ మూవీ కూడా ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో కొందరు దర్శక నిర్మాతలు పవన్‌ను ఐరన్ లెగ్ అంటున్నారట. ఇకపై ఆయనను అసలు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కూ పిలవకూడదని అనుకుంటున్నారట. అయితే ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరు కావడమే పవన్ పని అని. సినిమాను ఆయన తీయరు కదా.. అలాంటప్పుడు కేవలం వేడుకకు హాజరైనంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయితే ఆయనకేంటి సంబంధం.. ఆయనపై నింద ఎందుకు వేస్తున్నారు.. అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే వాస్తవానికి సినిమా నచ్చకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతమైన విజువల్ వండర్ కాబట్టి ప్రేక్షకులు సహజంగానే దాన్ని హిట్ చేశారు. అలాగే సినిమాలో బలమైన కథ ఉన్నా హిట్ అవుతుంది. అవేవీ లేకుండా కేవలం కమర్షియల్ హంగుల కోసం సినిమా తీసి బొక్క బోర్లా పడితే.. దానికి పవన్‌ను నిందించడం ఎంత వరకు కరెక్ట్ ? అనేది మేకర్స్ ఆలోచించుకోవాలి. ఇకనైనా ప్రీ రిలీజ్ వేడుకలకు గెస్ట్‌లుగా ఎవర్ని పిలవాలి.. అనే దానిపై కాకుండా ప్రేక్షకులు మెచ్చేలా సినిమా ఎలా తీయాలి.. అన్న దానిపై దృష్టి పెడితే బాగుంటుంది. లేదంటే.. ఇలాగే ఫ్లాప్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది.