Virat Kohli : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కోహ్లి పెట్టే పోస్టులు అప్పుడప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. ఇక తాజాగా దీపావళి నేపథ్యంలో కోహ్లి మరోమారు పోస్టు పెట్టగా.. దాని పట్ల నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి పండుగ వస్తుందని, కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహాలతో పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. తాను సమయం దొరికినప్పుడు దీపావళిని ఎలా జరుపుకోవాలో.. టిప్స్ ఇస్తానని.. చెబుతూ కోహ్లి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లు దీనిపై మండి పడుతున్నారు.
Over the next few weeks, I'll be sharing a series of my personal tips for celebrating a meaningful Diwali with loved ones and family. Stay tuned by following my Pinterest profile 'viratkohli' – link in bio 🪔@Pinterest#diwali2021 #AD pic.twitter.com/KKFxyK3UTG
— Virat Kohli (@imVkohli) October 17, 2021
నిజానికి కోహ్లి గతేడాది కూడా ఇలాగే దీపావళికి బాణసంచా కాల్చవద్దని, పర్యావరణాన్ని రక్షించాలని కోరాడు. కానీ నెటిజన్లు అప్పుడు కూడా ఇలాగే స్పందించారు. కోహ్లిని తీవ్రంగా విమర్శించారు. ఇక ఇప్పుడు కూడా కోహ్లిపై అలాగే మాటల దాడి చేస్తున్నారు.
Kohli told he will share a series of his personal tips for celebrating a meaningful Diwali.
Is he ready to give these same tips to the Ramdan, Bakrid and Christmas?
R u @imVkohli#SunoKohli#diwali2021 pic.twitter.com/9ahimyU7Tu
— Nivane Kalanath Bhat (@KalanathNivane) October 18, 2021
https://twitter.com/thanossharma1/status/1449956058626027522
కోహ్లి నీతులు చెప్పడం ఆపాలని, ఇతర పండుగలకు అయితే ఇలాగే చెబుతావా ? అని అందరూ కోహ్లిని విమర్శిస్తున్నారు. రోహిత్ శర్మ దీపావళికి బాణసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటే చూడాలని ఉందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
My festival.. my pride.. I don't need any teachings or so called "Gyaan" on how to celebrate it..#SunoKohli https://t.co/FB8yL5HABK
— Parrtha Daas 🕉 (@aasthik_bhakt) October 18, 2021
https://twitter.com/thisis_yadav/status/1449955668899741698
కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2021 సీజన్‌లో బెంగళూరు ప్లే ఆఫ్స్‌లో చతికిల పడింది. తక్కువ పరుగుల స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేయలేకపోయింది. దీంతో కోహ్లిపై బెంగళూరు ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ వివాదం చుట్టు ముట్టింది. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానని ఇప్పటికే కోహ్లి ప్రకటించాడు. దీంతో ఇది కెప్టెన్‌గా అతనికి ఆఖరి టీ20 వరల్డ్ కప్ అయింది. మరి ఈ కప్‌ను అతని సారథ్యంలో టీమిండియా సాధిస్తుందో, లేదో చూడాలి.