Viral Video : వన్యమృగాలు ఉన్నాయి జాగ్రత్త అని.. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోంచి వెళ్లే దారుల వెంట ఈ హెచ్చరికలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సైన్ బోర్డులు లేకపోతే.. తెలియని వాళ్లు ఎవరైనా వన్యమృగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు పెడతారు. తెలిసో, తెలియకో మానవులు కూడా వన్య మృగాలకు ఎలాంటి హానీ తలపెట్టవద్దనే విజ్ఞప్తి ఈ హెచ్చరికల్లో నిగూడమై ఉంటుండటం విశేషం. అయితే, అటవీ శాఖ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ.. కొంతమంది యువత మాత్రం అటవీ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అడవిలో వన్యప్రాణులను ఇబ్బంది పెడుతుంటారు.
ఇంకొన్నిసార్లు వన్యప్రాణులను ఇబ్బందిపెట్టే క్రమంలో తమకు తెలియకుండానే ఆపద కొని తెచ్చుకుంటుంటారు. ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో కూడా అలాంటిదే. పైన మీరు చూసిన దృశ్యం మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోనిది. ఒక పులి రోడ్డు దాటి వెళ్లేందుకు వస్తున్న క్రమంలో దానిని గమనించిన యువకులు అక్కడే ఆగి దానిని తమ కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తాము వెంటాడుతోంది ఒక పులిని అనే విషయం కూడా మర్చిపోయి దానికి అతి సమీపంలోకి వెళ్లబోయారు.
వారిలో ఒక యువకుడైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు. ఐతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దయచేసి ప్రమాదకరమైన క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించకండి. ఇలాంటి అత్యుత్సాహన్ని మానుకోండి అని యువతను హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…