Viral Video : సాధారణంగా పాము అంటే ప్రతి ఒక్కరు ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ పాములతో విన్యాసాలు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ప్రస్తుతం అలాంటి ధైర్యాన్ని కనబరుస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక పాము ఔత్సాహికుడు. కర్ణాటకలోని సిర్సీకి చెందిన 20 ఏళ్ల సయ్యద్ అడవిలో ఏకంగా మూడు తాచు పాములతో కలిసి విన్యాసాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా, మాజ్ సయ్యద్ షేర్ చేసిన ఈ వీడియోలో సయ్యద్ మూడు పాములతో విన్యాసాలు చేస్తున్నాడు. ఇలా మూడు తాచు పాముల తోక పట్టుకొని వాటిని వృత్తాకారంలో తిప్పుతూ విన్యాసాలు చేశాడు. ఇలా విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒక పాము అతనిపై దాడి చేసింది. ఇలా పాము ఆ వ్యక్తిపై దాడి చేయడంతో ఆ పామును ఘోరంగా చంపారు.
https://twitter.com/susantananda3/status/1504098801656934403
ఈ విధంగా ఆ వ్యక్తి మోకాళ్ళపై పాము కాటు వేయడంతో వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా పాము వదలలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనిషి హావభావాలు భయంకరంగా, బెదిరింపుగా ఉండటం వల్లే ఆ తాచుపాము తీవ్రంగా స్పందించిందని.. అందుకే అది కాటు వేసిందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ వ్యక్తి పాములతో కలిసి చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సయ్యద్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుండగా.. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.