Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మొదటిసారిగా లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్‌డే పార్టీకి హాజరైంది. బర్త్ డే పార్టీలో అనన్య పాండే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె తెగ సందడి చేసింది. ఇక ఈ పార్టీకి వచ్చిన వారందరితో ఈమె హడావిడిగా మాట్లాడుతుండగా వెనుక నుంచి ఎవరో వీడియో తీశారు.

ఇలా వీడియో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఈమె ధరించిన డ్రెస్ లో అందాలని ఆరబోస్తూ కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు పార్టీలకు ఇలా కూడా వస్తారా ? ఇలాంటి డ్రెస్ వేసుకోవడం కన్నా మొత్తం విప్పేస్తే బెటర్ కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
మొత్తానికి ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఈ బర్త్ డే పార్టీ కోసం లైగర్ చిత్రబృందం కూడా హాజరైంది. ఈ వీడియోలో అనన్య పాండే విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ కనిపించింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.