Viral Video : ప్రమాదాలు సంభవించే సమయంలో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దీంతో ఆ ప్రమాదాల నుంచి ఎలాంటి నష్టం లేకుండా బయట పడేందుకు వీలుంటుంది. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా ఇలాగే చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంటర్ నుంచి ఓ మినీ బస్సు వస్తోంది. అయితే మార్గ మధ్యలో ఆ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను బస్సును అడ్డ దిడ్డంగా పోనివ్వసాగాడు. ఈ క్రమంలో బస్సులో ఉన్న మహిళలు, పిల్లలు తీవ్రంగా భయపడ్డారు. అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా సతవ్ అనే మహిళ చాకచక్యంగా వ్యవహరించింది.
సదరు డ్రైవర్‌ను సీట్ నుంచి తీసి పక్కన పడుకోబెట్టి వెంటనే స్టీరింగ్ అందుకుంది. తనకు కార్ నడిపిన అనుభవం ఉంది. దీంతో ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆ మినీ బస్సును పరుగెత్తించింది. అలా ఆమె ఆ బస్సును సుమారుగా 10 కిలోమీటర్ల దూరం నడుపుతూ వచ్చి ఆ డ్రైవర్‌ను హాస్పిటల్‌లో చేర్పించింది. అనంతరం ఆ బస్సులో ఉన్నవారి తమ తమ ఇళ్ల వద్ద దింపేసింది.
కాగా ఆ మహిళ బస్సు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. అందరూ ఆమె ధైర్యానికి, సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని ఆమెను నెటిజన్లు అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…