News : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి తన భార్య (32)ను సిగరెట్లతో కాల్చాడు. అంతటితో ఆగకుండా వారు ఐదుగురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆ మహిళ ఇండోర్‌కు చెందిన వ్యక్తిని కొంత కాలం కిందట పెళ్లి చేసుకుంది. ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఇద్దరికీ పరిచయం కాగా వారు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తికి అంతకు ముందే వివాహం అయిందని పోలీసులు తెలిపారు.
కాగా ఇండోర్‌లోని శిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ వ్యక్తి ఫామ్ హౌస్‌కు తన భార్యను తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతనికి చెందిన నలుగురు స్నేహితులు అక్కడికి వచ్చారు. వారందరూ కలిసి ఆ మహిళను సిగరెట్లతో కాల్చారు. ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనతో అసహజ రీతిలో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నారని.. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఆ ఫామ్ హౌస్ నుంచి ఎలాగో తప్పించుకుని బయట పడిన ఆమె చత్తీస్ గఢ్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. ఆమె భర్తకు చెందిన ఒక స్నేహితుడు ఆమెను అక్కడి వరకు ఫాలో అయ్యాడు. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె భర్తను, అతని నలుగురు స్నేహితులను చత్తీస్‌గడ్, ఇండోర్‌లలో భిన్న ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…