Laughing Buddha : చాలా మందికి అనేక సమస్యలు వస్తుంటాయి. కొందరికి డబ్బు సమస్య ఉంటే కొందరికి కుటుంబంలో కలహాలు ఉంటాయి. ఇక కొందరు దంపతులు ఎల్లప్పుడూ గొడవలు పడుతుంటారు. సంసారం సాఫీగా సాగదు. అయితే ఈ సమస్యలన్నింటికీ ఇంట్లో వాస్తు దోషాలు లేదా నెగెటివ్ ఎనర్జీ కారణం అవుతుంటాయి. అలాంటప్పుడు వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో అన్ని సమస్యలు పోతాయి.
ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయి. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ పెట్టరాదు. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటంటే..
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ గొడవలు జరుగుతుంటే.. అలాంటి ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తూర్పు వైపున ఉంచాలి. దీంతో గొడవలు తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో అందరూ కలసి మెలసి ఉంటారు.
ఇంట్లో ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అలాగే డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
ఇంటి బయట అందరూ చూసేట్లు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెడితే ఆ ఇంటిపై, ఇంట్లోని కుటుంబ సభ్యులపై ఉండే దిష్టి పోతుంది. ఉద్యోగులు తమ కెరీర్‌లో రాణిస్తారు. వ్యాపారస్తులు లాభసాటిగా వ్యాపారం చేస్తారు.
రెండు చేతులు పైకి ఎత్తి ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కార్యాలయాల్లో పెట్టుకుంటే ఉద్యోగులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
దంపతులు బెడ్ రూమ్‌లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని వంట గదిలో, బాత్ రూమ్ సమీపంలో పెట్టరాదు. పెడితే అన్నీ సమస్యలే వస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…