Viral News : సంక్రాంతి అంటేనే.. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి హంగామా చేసే పండుగ. ఈ క్రమంలోనే కొత్త అల్లుడికి అత్తింటి వారు మర్యాదలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మర్యాదలు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మామూలే. ఇక గోదావరి జిల్లాల్లో అయితే అల్లుళ్లకు సంక్రాంతి పండుగ సమయంలో లభించే మర్యాదలు అన్నీ ఇన్నీ కావు.
సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరికి చెందిన ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో భోజనం పెట్టారు. ఆ భోజనంలో అనేక వెరైటీలు ఉన్నాయి. అన్నం, పులిహోర, బిర్యానీ.. వంటి వంటకాలను అత్తింటి వారు వండి అల్లుడికి వడ్డించారు.
30 రకాల కూరలు, 160 రకాల స్వీట్లు, 19 రకాల కారం పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్‌లు, 35 రకాల కూల్ డ్రింక్స్, 15 రకాల కేకులు ఆ భోజనంలో ఉన్నాయి. వాటన్నింటితో ఆ కుటుంబం తమ అల్లుడికి భోజనం పెట్టింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ ఇలాగే కొందరు అత్తింటి వారు తమ అల్లుళ్లకు ఈ విధంగా అధిక సంఖ్యలో వంటకాలతో భోజనాలు పెట్టి వార్తల్లో నిలిచారు. దీంతో ఇప్పుడీ వార్త కూడా వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…