Viral Video : ప్రమాదాలు అనేవి అనుకోకుండానే జరుగుతుంటాయి. చెప్పి జరగవు. కానీ అవి జరిగేటప్పుడు సమయస్ఫూర్తి, చాకచక్యంతో వ్యవహరించాలి. దీంతో ఎలాంటి నష్టం జరగకుండా బయట పడవచ్చు. సరిగ్గా ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ కూడా అలాగే చేసింది. వేగంగా వస్తున్న కారు ఢీకొట్టబోయేలోగానే ఆమె ఆ బాలికను పక్కకు లాగి రక్షించింది. వివరాల్లోకి వెళిలే..
అమెరికాలోని మేరీల్యాండ్ అనే ప్రాంతంలో ఉన్న నార్త్ ఈస్ట్ మిడిల్ స్కూల్ ఏరియాలో అన్నెట్ గుడ్ ఇయర్ అనే మహిళా పోలీస్ ఆఫీసర్ గా గత 14 ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తోంది. రోడ్డుపై వచ్చే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ పాదచారులు, వాహనదారులను సురక్షితంగా అక్కడి కూడలి నుంచి క్రాస్ చేయించాలి. ఇదీ.. ఆమె రోజూ చేసే పని.
అయితే తాజాగా ఒక రోజు ఆమె యథావిధిగా డ్యూటీలో ఉంది. ఈ క్రమంలోనే కూడలి వైపు వేగంగా వస్తున్న ఓ కారును ఆగాల్సిందిగా ఆమె సూచించింది. అప్పుడే ఓ బాలిక రోడ్డు దాటుతుండగా.. ఆమె ఆ కారును ఆపమని సైగ చేసింది. అయితే ఆ కారు డ్రైవర్ దాన్ని పట్టించుకోలేదు. వేగంగా వస్తూనే ఉన్నాడు. దీంతో ప్రమాదాన్ని ఊహించిన అన్నెట్ రోడ్డు దాటుతున్న బాలికను వెంటనే పక్కకు లాగింది. అదే సమయానికి కారు కూడా వేగంగా వచ్చింది. ఆమె ఆ బాలికను పక్కకు లాగకుండా ఉంటే ఆ కారు ఆ బాలికను ఢీకొట్టి ఉండేది. ఆమె లాగడంతో ఆ బాలిక ప్రాణాలతో బయట పడింది.
ఇక ఈ సంఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీన్ని అక్కడి సెసిల్ కంట్రీ ఎగ్జిక్యూటివ్ డానియెల్ హార్న్‌బర్గర్ షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. అందరూ ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ చేసిన పనికి ఆమెను అభినందిస్తున్నారు. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడావంటూ ఆమెను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించగా.. అందరూ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…