Chiranjeevi : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత రసాభాసగా జరిగాయో అందరికీ తెలిసిందే. మా ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మోహన్‌బాబు, చిరంజీవి మద్దతుదారులు రెండు వర్గాలుగా ఏర్పడి మాకు ఓటేయండి అంటే మాకు ఓటేయండి.. అంటూ ఒకళ్లపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకున్నారు. ఓ దశలో మా ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. దీంతో మా ఎన్నికల్లో రాజకీయం వేడెక్కింది. చివరకు సీనియర్ నటులు అని కూడా చూడకుండా కొందరు దారుణమైన కామెంట్లు కూడా చేశారు. అయితే ఎట్టకేలకు ఆ ఎన్నికల్లో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మా ఎన్నికల్లో ఒకరిద్దరు మినహా మొత్తం మంచు వర్గానికే సినీ నటులు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వర్గీయులు కొందరు గెలిచినప్పటికీ వారు ఆ అసోసియేషన్‌లో ఇమడలేమని చెప్పి రాజీనామా చేశారు. వాటిని విష్ణు ఈ మధ్యే ఆమోదించారు. అయితే తాజాగా ఏపీలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల విషయమై మరోమారు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంపై గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇక అప్పటి నుంచి వివాదం రాజుకుంటూనే ఉంది.
అయితే కరోనా వల్ల ఏపీలో మరోమారు థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. దీంతోపాటు అంతకు ముందే టిక్కెట్ల ధరలను చాలా వరకు తగ్గించారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే కరోనా ప్రభావం తగ్గుతుంది కనుక త్వరలోనే అక్కడ ఆ రూల్స్‌ను ఎత్తేస్తారని తెలుస్తోంది. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను తొలగించినా.. టిక్కెట్ ధరల విషయం మాత్రం అలాగే ఉంటుంది.. కనుక ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ చిరంజీవి మొన్నీ మధ్యే సీఎం జగన్‌ను కలిశారు.
సీఎం జగన్‌తో చిరంజీవి ఇండస్ట్రీకి చెందిన పలు సమస్యలపై చర్చించారు. అయితే మరోమారు ఇతర టాలీవుడ్ పెద్దలందరినీ జగన్ వద్దకు తీసుకెళ్లి ఆయనతో మరింత వివరంగా మాట్లాడాలని చిరంజీవి భావించారు. దీంతో ఫిబ్రవరి 8వ తేదీన ఆయన టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కావాలని అనుకున్నారు. కానీ ఆ ప్రముఖుల్లో కొందరు మోహన్ బాబు మద్దతు దారులు ఉండడంతో వారు ఇప్పుడు సమావేశం కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సమావేశం మరో రెండు రోజులకు వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీన ఆ సమావేశం జరుపుదామని నిర్ణయించారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించడంలో చిరంజీవి చూపుతున్న చొరవ, ఆయన చేస్తున్న సేవను తట్టుకోలేని మోహన్‌బాబు వర్గీయులు ఆ సమావేశం జరగకుండా చూస్తున్నారని, అందుకనే మంగళవారం జరగాల్సిన ఆ సమావేశం వాయిదా పడిందని తెలుస్తోంది. చిరంజీవి చేస్తున్న సేవను జీర్ణించుకోలేకే వారు ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీన అయినా టాలీవుడ్ ప్రముఖులతో చిరంజీవి సమావేశం జరుగుతుందా ? లేక ఆయన ఒంటరిగానే మరోమారు సీఎం జగన్‌ను కలుస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో చిరంజీవి ఈ మధ్య యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కానీ అటు మా అధ్యక్షుడు మంచు విష్ణు కానీ, ఆయన తండ్రి మోహన్ బాబు కానీ పెద్దగా దీనిపై కృషి చేసింది ఏమీ లేదు. ఒక ప్రకటన విడుదల చేసి తప్పుకున్నారు. ఇక తాజాగా మంచు విష్ణు అయితే.. ఇండస్ట్రీ సమస్యలను అందరం కలసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం చేసుకోవాలి కానీ.. ఒకరిద్దరు ఇలా చేయరాదని.. చిరంజీవిపై పరోక్షంగా కామెంట్లు చేశారు. దీంతో మరోమారు చిరంజీవి, మోహన్ బాబు వర్గాల మధ్య ఉన్న విభేదాలు తెరపైకి వచ్చాయి.
వాస్తవానికి ఈ మధ్య కాలంలో అటు చిరంజీవి, ఇటు మోహన్ బాబు.. ఇద్దరూ తాము మంచి స్నేహితులమని చెప్పుకున్నారు. హగ్ చేసుకున్నారు. మా డైరీ ఆవిష్కరణలోనూ కలసి పాల్గొన్నారు. కానీ చిరంజీవి ఒక్కరే ఇండస్ట్రీ సమస్యలపై పనిచేస్తుండడం.. మంచు వర్గీయులకు నచ్చడం లేదని.. అందుకనే వారు సడెన్‌గా తెరపైకి వచ్చారని.. ఈ క్రమంలోనే చిరంజీవి జరుపుదామని అనుకున్న సమావేశాన్ని కూడా వారు కావాలనే వాయిదా వేయించారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం చివరకు ఏమవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ సమస్యలపై ఇరు వర్గాలు కలసి పనిచేస్తాయా, లేక చిరంజీవి ఒక్కరే ఒంటరిగా ముందుకు సాగుతారా.. అన్న విషయం తేలాల్సి ఉంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…