Viral Pic : హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో.. ఫ్యాన్ పేజెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ చిన్నారి గత 20 ఏళ్లగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాకు.. హీరోయిన్ అంటే ముందుగా ఈమె గుర్తొచ్చేది.
ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టలేదా.. ఇటీవల విజయ్ సేతుపతితో 96 అనే మోడర్న్ కల్ట్ క్లాసిక్ మూవీలో నటించింది. ఇప్పుడు గుర్తొచ్చింది కదా.. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపాయి చెన్నై చంద్రం త్రిష కృష్ణన్. 2003లో వచ్చిన నీ మనసు నాకు తెలుసు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది త్రిష. వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సూపర్ హిట్ అవ్వడంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి.
తెలుగులో దాదాపు స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది త్రిష. అలాగే తమిళ్‌లోనూ పలు సూపర్ హిట్ మూవీల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ అగ్రహీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. 96 సినిమాతో చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందుకుంది త్రిష. ఇకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలే చేస్తోంది. టాలీవుడ్ లోకి త్రిష రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…