Cobra Movie Review : వైవిధ్యభరితమైన చిత్రాలను చేయడంలో చియాన్ విక్రమ్‌కు మంచి పేరుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ వేటికవే చాలా ప్రత్యేకమైనవి. శంకర్ దర్శకత్వంలో అప్పట్లో చేసిన అపరిచితుడు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ తరువాత మళ్లీ ఆయన అలాంటి సినిమాలు చేయలేదు. కానీ ఆయన నటించిన చిత్రాల్లో చాలా వరకు హిట్ అయ్యాయి. ఇక తాజాగా ఆయన మరోమారు కోబ్రా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను అలరిస్తుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ..
ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన వ్యక్తులను కోబ్రా అనే అంతర్జాతీయ కిల్లర్ వరుసగా చంపుతుంటాడు. ఇతన్ని పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సహా పలు దేశాలకు చెందిన పోలీసులు బాగా గాలిస్తుంటారు. అయినప్పటికీ ఆచూకీ కూడా లభించదు. అయితే చివరకు ఏమవుతుంది ? కోబ్రాను పట్టుకుంటారా ? అతను ఎందుకు అలా హత్యలు చేస్తుంటాడు ? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
విక్రమ్ నటనకు పేరుపెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించగలడు. కోబ్రా మూవీలోనూ అలాగే చేశాడు. పలు భిన్న గెటప్‌లలో తనదైన శైలిలో నటించారు. ఇక ఇందులో ముగ్గురు ఫీమేల్ లీడ్స్ నటించారు. వారిలో ఒకరు పోలీస్ ఆఫీసర్ గా విక్రమ్‌ను ఛేజ్ చేస్తుంటారు. ఇంకో ఇద్దరు విక్రమ్‌కు జోడీగా నటించారు. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి విక్రమ్ కు జోడీలుగా చేశారు. ఇక మీనాక్షి గోవింద రాజన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈమె కోబ్రాను వెంబడిస్తుంటుంది.
ఇక ఈ మూవీలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా యాక్ట్ చేశాడు. ఆయన ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇక మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే యాక్ట్ చేశారు. కాగా ఈ మూవీ దర్శకుడికి ఇది 3వ సినిమా. అంతకు ముందు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డిమాంటి కాలనీ, అంజలి సిబిఐ వంటి చిత్రాలను చేశారు. అయినప్పటికీ ఎంతో పరిణతి ఉన్న దర్శకుడిగా చేయడం విశేషం. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. సంగీతం ఏఆర్ రెహమాన్ కాగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
అయితే ఈ మూవీలో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథలో కొత్తదనం, అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో సినిమాను నిర్మించడం, ఇంటర్వల్ బ్లాక్ వంటివి ప్లస్ పాయింట్స్ కాగా.. సినిమా నిడివి, అనవసరపు సన్నివేశాలు, అవసరం లేని డ్రామా, అర్థం పర్థం లేని కొన్ని సీన్లు, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సీన్లు.. చాలా ఉన్నాయి. అందువల్ల ఇవి మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అయితే మొత్తంగా చూస్తే యాక్షన్, డ్రామా చిత్రాలను కోరుకునే వారు కోబ్రా మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. అది కూడా అంతసేపు చూసే ఓపిక ఉంటే. లేదంటే లైట్ తీసుకోవడమే బెటర్.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…