Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో చేసిన కొన్ని సినిమాలు ఘోరంగా నిరాశ పరిచాయి. ఛత్రపతి తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత చేసిన ఓ సినిమాకు ఆయన అభిమానులే బాధ పడుతుంటారు. అదేంటంటే.. కృష్ణవంశీ తెరకెక్కించిన చక్రం మూవీ థియేటర్లలో దారుణంగా నిరాశ పరిచింది.
ఈ సినిమా చేసే ముందు చాలా మంది ప్రభాస్‌ను హెచ్చరించారట. కథ బాగానే ఉన్నా మన వాళ్లకు కనెక్ట్ అవ్వదు.. రిస్క్ తీసుకోవద్దు అన్నారట. అప్పటికి తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు అనే నానుడి ఉంది. అయినా కూడా ప్రభాస్ డేర్ చేశాడు. మొత్తానికి మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆయన శ్రేయోభిలాషులతోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చక్రం సినిమాను చేయొద్దంటూ ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చారు. అందులో చిరంజీవి ముందున్నారు. ఆ తర్వాత గోపీచంద్ కూడా చెప్పాడట.
ఇదే విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు. తరుణ్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు వద్దని చెప్పినా వినలేదట ప్రభాస్. కేవలం ఆయన మొహమాటం కారణంగా కృష్ణవంశీకి మాటిచ్చేశాడు. ఇచ్చిన మాట కోసం చక్రం సినిమా చేశాడు. నిర్మాతలతోపాటు బయ్యర్లకు కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఆసిన్, ఛార్మి ఇందులో హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. అయితే థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ.. యూట్యూబ్, టెలివిజన్ లో మాత్రం ఇప్పటికీ చక్రంకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…