Vijay Devarakonda : బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్‌ట్యాగ్. ఇప్పటికే వరుస ఫెయిల్యూర్లతో ఉన్న బాలీవుడ్ ను బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ మరింత టెన్షన్ పెడుతోంది. అమీర్ లాల్‌సింగ్ చడ్డా దగ్గర నుంచి అక్షయ్ రక్షాబంధన్, షారుఖ్ పఠాన్.. ఇలా టాప్ హీరోలే లక్ష్యంగా రోజుకో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తోంది. తాజాగా ఆ సెగ లైగర్ చిత్రానికి కూడా తగులుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం లైగర్. ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ తరుణంలో లైగర్ మూవీపై కొందరు నెటిజన్స్ నెగెటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత ఈ ట్రెండ్ బలంగా వినిపిస్తోంది. ఆయన మరణానికి బాలీవుడ్ హీరోలు కరణ్ జోహార్ వంటి నెపోటిజంను ప్రోత్సహించే దర్శక నిర్మాతలే కారణం అంటూ కొంతమంది నెటిజెన్లు బాలీవుడ్ ను బాయ్ కట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా కరణ్ జోహార్, కరీనా కపూర్ వంటి సెలబ్రిటీలు బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ఇబ్బంది పడ్డవారే. అయితే తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ దీనిపై మాట్లాడారు. లాల్ సింగ్ చడ్డా అనేది అమీర్ ఖాన్ సినిమాలో పోషించిన పాత్ర పేరు. ఆయనొక్కడిదే సినిమా కాదు. దానిపై దాదాపు రెండు నుంచి మూడు వేల కుటుంబాలు ఆధారపడ్డాయి అన్నారు.
అమీర్ ఖాన్‌కి విజయ్ దేవరకొండ సపోర్ట్ గా మాట్లాడడంతో ఇప్పుడు లైగర్‌పై కూడా నెగెటిల్ ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ కరణ్ జోహార్ బ్యానర్‌లో లైగర్ మూవీ చేయటంతో బ్యాన్ చేస్తున్నామని ఒకరంటే.. అతనికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ బాయ్‌కాట్ లైగర్ పేరుతో నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి తమ సినిమాపై వస్తున్న నెగెటివ్ ట్రోలింగ్‌పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…